![]() |
![]() |
.jpg)
సెప్టెంబర్ తొలి వారం నుంచి ‘బిగ్ బాస్ 5’ స్టార్ట్ చేయడానికి స్టార్‌మా ఛానల్ సిద్ధంగా ఉంది. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. హౌస్‌లోకి పంపించే కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవర్ని పంపాలనే విషయంలో స్టార్‌మా చాలా క్లియర్‌గా ఉంది.
‘బిగ్ బాస్ 5’ కోసం స్టార్ మా కొంతమందిని ఎంపిక చేసింది. వాళ్ళందర్నీ ఆగస్టు 22న క్వారంటైన్‌లోకి పంపిస్తుంది. పంపించే ముందు అందరికీ కరోనా ఆర్‌టి–పిసిఆర్ టెస్ట్‌లు చెయ్యనున్నారు. కార్వంటైన్ కంప్లీట్ అయ్యిన తరవాత మరోసారి టెస్ట్‌లు చేసి హౌస్‌లోకి పంపాలని డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా ఉన్నట్టు తేలితే? అందుకని, రిజర్వ్ బెంచ్‌ను కూడా రెడీ చేసింది. కంటెస్టెంట్ల హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటోంది. సెప్టెంబర్ 5న ‘బిగ్ బాస్’ స్టార్ట్ కానుంది. అప్పటికి 14 రోజుల క్వారంటైన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో... హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరూ తోటి సభ్యులకు కరోనా ఉందేమోనని భయపడాల్సిన అవసరం లేదు.
‘బిగ్ బాస్’లోకి యాంకర్ రవి వెళ్తున్నట్టు లాస్య కన్ఫర్మ్ చేసింది. ఇంకెవరూ బయటపడలేదు. సాధారణంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లేవారెవరూ ముందు చెప్పరు కూడా! కాకపోతే, ఆర్‌జె కాజల్, షణ్ముఖ్ జస్వంత్, శ్వేతా వర్మ, సిరి హనుమంతు, లోబో, వీజే సన్నీ తదితరులు హౌస్‌లోకి వెళ్తారట.
![]() |
![]() |